మరో పవర్ఫుల్ ఫీచర్‌తో రానున్న వాట్సప్..!
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్యే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో మరో పవర్ఫుల్ ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్ అతి త్వరలో వాట్సప్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ యత్నిస్తోంది.
కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.
కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.