ఇకపై పీసీలోనూ గూగుల్ అలో ను వాడవచ్చు..!

వాట్సప్ తన యూజర్ల కోసం 2015 జనవరిలో వాట్సప్ వెబ్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. దీని వల్ల యూజర్లు వాట్సప్‌ను పీసీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే... ఇకపై గూగుల్‌కు చెందిన అలో మెసెంజర్‌ను కూడా ఇలాగే పీసీలో వాడుకోవచ్చు. అందుకు గాను ఆ సంస్థకు చెందిన డెవలపర్లు ఇప్పటికే ఆ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతి త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు లభ్యం కానుంది. అయితే వాట్సప్‌లో పీసీ బ్రౌజర్‌పై వచ్చే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుండగా, అలో లో అందుకు భిన్నంగా గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయి ఆ ఫీచర్‌ను వాడుకునేలా వీలు కల్పించనున్నట్టు తెలిసింది.
ఇక అలో పీసీ క్లైంట్ విషయానికి వస్తే వాట్సప్‌లోలాగే ఎడమ వైపు చాటింగ్ కాంటాక్ట్స్, కుడి వైపు చాటింగ్ విండో వంటివి ఏర్పాటు చేయనున్నారు. దీనికి తోడు యూజర్లు పీసీ క్లైంట్ లో కూడా ఎమోజీలు, స్టిక్కర్లు, జిఫ్‌లు, ఇతర ఫైల్స్ పంపుకునేలా వీలు కల్పించనున్నారు.
వాట్సప్ తన యూజర్ల కోసం 2015 జనవరిలో వాట్సప్ వెబ్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. దీని వల్ల యూజర్లు వాట్సప్‌ను పీసీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే... ఇకపై గూగుల్‌కు చెందిన అలో మెసెంజర్‌ను కూడా ఇలాగే పీసీలో వాడుకోవచ్చు. అందుకు గాను ఆ సంస్థకు చెందిన డెవలపర్లు ఇప్పటికే ఆ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతి త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు లభ్యం కానుంది. అయితే వాట్సప్‌లో పీసీ బ్రౌజర్‌పై వచ్చే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుండగా, అలో లో అందుకు భిన్నంగా గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయి ఆ ఫీచర్‌ను వాడుకునేలా వీలు కల్పించనున్నట్టు తెలిసింది.
No comments:
Post a Comment