Monday, 6 March 2017

WhatsApp Feature

మరో పవర్‌ఫుల్ ఫీచర్‌తో రానున్న వాట్సప్..!



ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొన్నా మధ్యే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకురాగా, త్వరలో మరో పవర్‌ఫుల్ ఫీచర్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్ అతి త్వరలో వాట్సప్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు. అయితే వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ యత్నిస్తోంది.

కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.
ఎవరైనా ఒక యూజర్‌కు వచ్చే ఫొటోలు, వీడియోల సైజ్‌ను తెలిపేందుకు ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పెద్ద సైజ్ కలిగిన ఫొటోలు, వీడియోలను యూజర్లు అవసరం లేదనుకుంటే వెంటనే ఫోన్‌లోంచి డిలీట్ చేసేందుకు వీలు కలుగుతుంది. దీంతోపాటు వాట్సప్‌లో ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్ ఎన్ని ఉన్నాయో తెలిపేందుకు కూడా ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది.

Sunday, 5 March 2017

Google ALLO

 ఇకపై పీసీలోనూ గూగుల్ అలో ను వాడవచ్చు..!


వాట్సప్ తన యూజర్ల కోసం 2015 జనవరిలో వాట్సప్ వెబ్ పేరిట ఓ నూతన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే. దీని వల్ల యూజర్లు వాట్సప్‌ను పీసీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే... ఇకపై గూగుల్‌కు చెందిన అలో మెసెంజర్‌ను కూడా ఇలాగే పీసీలో వాడుకోవచ్చు. అందుకు గాను ఆ సంస్థకు చెందిన డెవలపర్లు ఇప్పటికే ఆ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అతి త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు లభ్యం కానుంది. అయితే వాట్సప్‌లో పీసీ బ్రౌజర్‌పై వచ్చే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటోమేటిక్‌గా లాగిన్ అవుతుండగా, అలో లో అందుకు భిన్నంగా గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయి ఆ ఫీచర్‌ను వాడుకునేలా వీలు కల్పించనున్నట్టు తెలిసింది.
ఇక అలో పీసీ క్లైంట్ విషయానికి వస్తే వాట్సప్‌లోలాగే ఎడమ వైపు చాటింగ్ కాంటాక్ట్స్, కుడి వైపు చాటింగ్ విండో వంటివి ఏర్పాటు చేయనున్నారు. దీనికి తోడు యూజర్లు పీసీ క్లైంట్ లో కూడా ఎమోజీలు, స్టిక్కర్లు, జిఫ్‌లు, ఇతర ఫైల్స్ పంపుకునేలా వీలు కల్పించనున్నారు.